Home » Initiatives » States » South » Andhra Pradesh » సాంస్కృతిక పరిశోధనకు టాగూరు జాతీయ ఫేల్లోషిప్
tagore

సాంస్కృతిక పరిశోధనకు టాగూరు జాతీయ ఫేల్లోషిప్

పధకం పేరు :  టాగూరు నేషనల్ ఫెలోషిప్ ఫర్ కల్చరల్ రీసెర్చ్

లక్ష్యం :  మేధావులను మరియు విద్యావేత్తలను  సాంస్క్రుతిక మంత్రి వర్గం క్రింద పనిచేయుచున్న సాంస్క్రుతిక సంస్థలతో నూ మరియు గుర్తించబడిన ఇతర సాంస్క్రుతిక సంస్థలతో నూ అనుబంధము ఏర్పరిచి పరస్పర  ఆసక్తి గల అంశాలు గల ప్రాజెక్టులలో కలిసి పని చేయుటను  ప్రోత్సహించుట ద్వారా ఆ సంస్థలను బలోపేతం చేయుట .

టాగూరు నేషనల్ ఫెలోషిప్ కు నియమించుటకు మేధావులకు కావలసిన అర్హతలు :

వారి వారి రంగాలలో జ్ఞాన సముపార్జన మరియు జ్ఞానాభివృద్ధి కి యెనలేని సేవలు  అందించి విద్యా  సముపార్జనలో విజయవంతమైన గత చరిత్ర కలిగి ఉండవలెను.

ప్రముఖమయిన మరియు సూచించిన పత్రికలయందు వారి రచనలు ముద్రితమై ఉండవలెను లేక ఏ కలా రంగానికైనా లేక సాంస్క్రుతికి యెనలేని సేవలు అందించి ఉండవలెను.

పరిశోధన మరియు అనుభవాలలో అత్యుత్తమ స్థానములో ఉండవలెను

మేధావి వర్గాలను ఆకట్టుకున్న రచనలు చేసిన వారై ఉండవలెను

శిఖరాగ్ర సంస్థలు వాని అనుబంధ సంస్థలలోని ప్రాజెక్ట్లలో విశేష అనుభవం  ఉండి ఉండవలెను

నేషనల్ టాగూరు ఫెలోషిప్ ఆర్ధిక సహాయము :

విశ్వవిద్యాలయం ,  కళాశాల  , ఇతర పరిశోధనా సంస్థ  మరి ఏ  ఇతర ప్రభుత్వ సంస్థ ల నుండి ఎన్నిక కాబడిన అభ్యర్ధికి అతను అచ్చట పొందుతున్న అన్ని ఆర్ధిక లాభములు  అనగా జీత భత్యములు ఇచ్చట కూడా కొనసాగింప బడును.

ఇతర దేశముల నుండి కాని, పైన ఉదహరించిన సంస్థలు కాక మరి ఏ ఇతర సంస్థల నుండి కాని, ఉద్యోగ విరమణ చేసిన  వారు కాని ఎన్నిక కాబడిన వారికీ మాసమునకు Rs.80000 రూపాయల గౌరవ వేతనము లభించును.

ఎన్నిక కాబడిన అభ్యర్ధికి మరి ఏ ఇతర నిధుల నుండి కాని ఆర్ధిక సహాయము పొందుచున్నచో అట్టి అభ్యర్ధి యొక్క గౌరవ వేతనము నిశ్చయించు అధికారము NSC కి కలదు. ఎట్టి పరిస్థితి లోను గరిష్టముగా నెలకు ఎనభై వేల రూపాయలు మించ రాదు.

కాంటిన్జేంసి గ్రాంట్ :

విదేశములో నివాసము కాని విదేశి సంస్థ సేవలో ఉన్న స్వదేశీయులకు కాని విదేశీయులకు ఒక పర్యాయము తిరిగి ఆ దేశమునకు వెళ్ళుటకు ఎకానమీ తరగతి లో వాయు మార్గ ప్రయాణ ఖర్చులు ఇవ్వబడును.  

ఈ పధకము లోని మేధావులు అందరికి పరిశోధన సంబంధిత మైన ప్రయాణ మరి ఏ ఇతరములైన ఖర్చులు   నిజ ఖర్చుల ప్రాతిపదికను  గరిష్టముగా ఏడాదికి Rs.2.50లక్షలు ఇవ్వబడును.

కాల ప వ్యవధి :  గరిష్టముగా రెండు సంవత్సరములు.

మరింత సమాచారము కొరకు :

http://www.nehrumemorial.nic.in/images/pdf/htn_felloship/Scheme_of_Tagore.pdf

ఆర్జీ పంపుటకు :

http://indiaculture.gov.in/contact-us

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...