Home » Initiatives » States » South » Andhra Pradesh » స్వయం
Elearning_video_tool

స్వయం

పధకం పేరు  : స్వయం (స్టడీ వెబ్స్ అఫ్ ఆక్టివ్ ఫర్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పెరింగ్ మైండ్స్)

ధ్యేయం : సుదూర విద్యార్థులకు, పని చేస్తూ చదువు కొనసాగించే  ఉద్యోగస్థులకు, విద్యలో ఆటంకము కలిగిన విద్యార్ధులకు ఈ పధకం బహు ప్రయోజనా కారి. నాణ్యమైన విద్యను అందరికి అందుబాటు లోనికి తీసుకొని రావటం లక్ష్యముగా కేంద్రీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ పధకమును ప్రారంభించెను.

విధానము :   మూడు విభాగములలో ఆన్ లైన్ లో ప్రముఖ  అధ్యాపకుల/ ఆచార్యుల  ఉపన్యాసములు మరియు వారి సంకలనములను మరియు  సంపాదకీయములు  అంతరజాలం ద్వారా అందుబాటు లోనికి తెచ్చును. ఈ వెబ్ ఇడేఎక్స్ అను మరి యొక్క వెబ్ సహకారము తో అంతర్జాతీయముగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాల తో అనుసంధానించబడి ప్రముఖల ఉపన్యాసాలను వారి రచనలను విద్యార్ధులకు అందుబాటు లోనికి తెచ్చును. ఆన్ లైన్ అధ్యాపనలో  అమెరిక తరువాత భారత దేశము ద్వితీయ స్థానములో కలదు. ప్రప్రధమంగా ఈ క్రింద ఉదహరించిన విభాగములలో ఈ పధకము ప్రారంభించినవారు.  అవి

  1. U C BEKELEY విశ్వవిద్యాలయం సహకారముతో క్వాంటమ్ మెకానిక్స్ మరియు కంప్యూటేషన్
  2. IIT బొంబాయి వారి సహకారముతో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్
  3. IIT బొంబాయి వారి సహకారముతో ధేర్మోడైనమిక్స్.

IIT బెంగుళూరు కూడా ఈ  పథకములో  చేరినది. ఏక కాలములో డిజిటల్ గ్రంధాలయం కూడా స్థాపించబడినది. ఈ గ్రంధాలయమునకు ప్రముఖ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు ప్రముఖుల రచనలు, ఉపన్యాసములు, సంపాదకీయములు మరియు సంకలనములు మొదలగు వానిని అందచేయును. ఈ వెబ్ విద్యార్థులకు అన్ని వేళల  మరియు అన్ని రోజులలో అందుబాటులో యుండును.  కోర్సు ముగిసిన పిదప ‘Verified certificate’ అను ధృవపత్రం అందచేయబడును. కాని అట్టి ధృవపత్రం యొక్క ప్రయోజనం ఎక్కడను విశ్లేషించబడలేదు. విద్యార్ధులు వైఫల్యా చింత లేకుండా విద్య కొనసాగించ ఇది  అద్భుత అవకాశం కల్పించును

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme-Register now for health Benefits upto Rs. 2 lakh: Andhra Pradesh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...