Home » Initiatives » States » South » Andhra Pradesh » సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై)
sukanya-samriddhi-yojana image

సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై)

సుకన్య సమృద్ది యోజన, గర్ల్ చైల్డ్ ప్రోస్పోరిటీ స్కీం అను పిలవబడు ఈ పధకం మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిరి.  బాలికలకు ఉజ్వల భవిష్యత్తు అంద చేయుట ఈ పధక లక్ష్యం. బాలిక ల విద్యా మరియు వివాహ ఖర్చులు కి ఆర్ధిక వనరులు సమకూర్చుట ఈ పధక ధ్యేయం. బాలికలకు, వారి తల్లి తండ్రులకు మటియు వారి సంరక్షకులకు  ఈ పధకము వలన కలుగు ఆర్ధిక భద్రాతా మరియు ఆర్ధిక స్వాతంత్ర్య ము వలన జన సామాన్యం లో ఈ పధకం  అధిక ప్రాచుర్యం  పొందినది.  

“బేటి బచావో బేటి పధావో” ప్రచారంలో పప్రధమ అడుగుగా సుకన్య సమృద్ది యోజన ఖాతాలు చిన్న మొత్తాల పొదుపు కార్యక్రమముగా మొదలు పెట్టబడినది.  నిర్దేసింపబడిన వాయిదాలు సరసం మరియు వానిపై వచ్చు వడ్డీ అధికం  అగుట ఈ పధకము ఒక్క అత్యంత విలువైన ప్రయోజనము అయిఉన్నది.

లక్ష్యం : బాలికల సంక్షేమ ప్రచారం.

ఖాతా ప్రారిమ్భించుటకు అర్హులు : బాలికల యొక్క తండ్రి,తల్లి  లేక న్యాయ పరముగా ఉన్న సంరక్షుకుడు/సంరక్షకురాలు.

అత్యాధికముగా ప్రారంభించగల ఖాతాలు :  ఒక  కుటుంబములో ఇద్దరు బాలికలకు లేక రెండవ కాన్పులో బాలికలు కవలలు జన్మించిన మూడు  ఖాతాలకు పరిమితమైయున్నది.

పొదుపు చేయగల కనిష్ట మరియు గరిష్ట పరిమితులు : కనిష్ట ప్రారంభ జమ చేయ వలసిన మొత్తం వెయ్యి రూపాయలు తరువాత Rs.100/- ఒక్క గునిజాలుగా ఏడాదికి లక్షా యాభైవేలు గరిష్టం గా జమ చేయువచ్చును.

కాల పరిమితి : ఖాతా ప్రారంభ దినము నుండి 21సంవ్త్సములు.

ఖాతా నిల్వల పై వడ్డీ శాతం : భారత ప్రభుత్వం నోటిఫై చేసిన వడ్డీ శాతం సంవత్సరమునకు వడ్డీ లెక్క కట్టించు పద్దతిలో ఖాతాలోని నిల్వలు వెయ్యి రూపాయల గునిజలుగా తీసుకొని వడ్డీ చెల్లింపు జరుగును. ప్రస్తుతం వడ్డీ 9.20% గా ఉన్నది.

పన్ను రాయితీలు : సెక్షన్ 80సి క్రింద గరిష్టముగా లక్షా యాభైవేల వరకు పన్ను రాయతి కలదు. ఖాతా పరిణితి సమయమున వాపసు తీసుకొను అసలు మరియు వడ్డీ మీద పన్ను భారము ఉండదు.

పరిణిత ముందుగా ఖాతా రద్దు: జమ చేయు వానికి మరణం సంభవించిన లేక  అత్యంత ప్రాణాంతకమైన వ్యాధులకు వైద్య ఖర్చులు నిమిత్తం  ఉత్కృష్ట మానవతా దృక్పధంతో ప్రభుత్వ ఆజ్ఞ తో రద్దు చెసుకొన వెసులుబాటు కలదు.

ఖాతా పునరుజ్జీవనం/ సక్రముగా లేని జమలు:  సంవత్సరమునకు Rs. 50/- అపరాధ రుసుముతో కనిష్ట మొత్తం జమ చేయవలెను.

జమ చేయు విధానం : నగదు లేక చెక్కు లేక డిమాండ్ డ్రాఫ్ట్.

ఉపసంహరణ : బాలికకు 18సంవత్సరముల వయస్సు వచ్చిన పిదప ఉన్నతి విద్య లేక వివాహ ఖర్చుల నిమిత్తం నిల్వలలో అర్థ భాగం ఉపసిమ్హరించుకొన అవకాసము కలదు.

మరింత సమాచారం కొరకు:  http://www.sukanyasamriddhiaccountyojana.in/

Check Also

PC: Greater Kashmir

Get additional 5kg of ration from Govt under this Scheme (MMSFES) : Jammu and Kashmir

Objective To address the grievance of general public about decrease in their scale of ration ...