Home » Ministries » Agriculture » గ్రామీణ ఆవిష్కరణ నిధి
rural

గ్రామీణ ఆవిష్కరణ నిధి

పధకం పేరు : గ్రామీణ ఆవిష్కరణ నిధి(రూరల్ ఇన్నోవేషన్ ఫండ్)

పధకం మార్గదర్శక సూత్రాలు :

చేపట్ట తలచిన కార్యక్రమములు గ్రామీణ నిరు పేదలను ద్రుష్టియందుంచుకొని నూతన ఆవిష్కరణము, ప్రయోగాత్మకం గాను మరియు  ప్రదర్శించి తగిన దిగా నుండి ఆర్దికముగా లబ్ది చేకురించవలెను.

ఆర్ధిక సహాయము పొందిన కార్యక్రమాలు నూతన ఉత్పత్తులను అభివృద్ధి, ప్రక్రియ, నమూనాలు, సాంకేతిక, అధికారికం  మరియు పొడిగింపు మద్దతు కలిగి ఉండవలెను.

గ్రామీణ అభివ్రుద్దిలో ఎదురు అవుతున్న సమస్యలను పరిష్కరించుటకు తగు పరిశోధనలు మరియు అధ్యయనాలు చేసి విధానాలు రూపకల్పన చేసి వాటిని అమలు చేయవలసి ఉన్నది.

ఈ పధకము క్రింద మద్దతు పొందగల ప్రాజెక్ట్ లు :

వ్యవసాయ, వ్యవసాయేతర మరియు సూశ్మ ఫైనాన్సు రంగాల కు సంబంధించిన ఆవిష్కరణ మరియు తత్ సంబంధిత కార్యక్రమాలకు గ్రామీణ ఆవిష్కరణ నిధి నుండి సహాయము లభించగలదు. 

ఈ పధక మార్గదర్శక సూత్రాలకు లోబడిన అన్ని కార్యక్రమములకు ఈ పధకము ద్వారా సహాయము పొందవచ్చును. ప్రత్యేకముగా ఆవిష్కరణ మరియు నైపున్యాభివ్రుద్ది  కి ప్రాముఖ్యత ఇవ్వబడును.

ప్రాధాన్యత రంగములు:

బీడు భూములు / వర్షాధార త

గ్రామీణ నివాసాలకు   వర్షపు నీటి వినియోగంలో ఆవిష్కరణములు

జీవ వ్యర్ధము/ వ్యవసాయ వ్యర్ధముల నుండి గ్రామీణ అవసరాలకు విద్యుత్ ఉత్పాదన

పంట అవశేషం మరియు పంట కాని ఇతర జీవ పదార్దముల విలువలు పెంచు పద్దతులు

నీరు మరియు విద్యుత్ పంపిణి ని గ్రామీణ సంఘాల నియంత్రణలు

వ్యవసాయ మరియు గ్రామీణ ఉత్పత్తుల నిల్వ చేయు పరికరములు

నిర్వహణలో నూతన అవిష్కరణములు

సాధారణ ఆస్థి వనరులు

గ్రామీణ రహదారుల నిర్మాణమునకు రూపకల్పన మరియు మెటీరియల్స్

గ్రామీణ పారిశుద్యము మరియు వ్యర్ధాల నిర్వహణ

అర్హత:

గ్రామాల అభివృద్దిలో ఉత్సాహం ఉన్న వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్థలు, స్వయం సహాయక బృందాలు. రైతు బృందాలు, పంచాయతీలకు చెందిన సంస్థలు,  మొదలుగున్న వారు అర్జీ పెట్టుకొన వచ్చును.

ఆర్ధిక సహకారము :

ఋణ రూపేణ లేక విరాళము రూపేణ లేక ఇంక్యుబెషణ్ ఫండ్ రూపేణ లేక మూడు విధములు గాను ఆర్ధిక సహాయము లభించును. ప్రాజెక్ట్ అవసరాల అనుగుణముగా సహాయము లభించును. కేసు టు కేసు పద్దతిలో సహకారము  అంద చేయబడును.

 

మరింత సమాచారము కొరకు: https://www.nabard.org/english/home.aspx

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...