Home » Initiatives » States » South » Andhra Pradesh » ఆరోగ్యమే మహా భాగ్యం
health

ఆరోగ్యమే మహా భాగ్యం

దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించ జాతీయ ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన పధకం ‘రాష్ట్రీయ స్వాస్థ్య భీమ యోజన’. ప్రభుత్వ మరియు ఎంపిక చేయబడిన ప్రైవేటు ఆసుపత్రియందు నగదు రహిత వైద్య సదుపాయము లభించును.  ఆసుపత్రి వైద్య ఖర్చులు నుండి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్ధిక రక్షణ కలిగించటం ఈ పధకం ముఖ్యోద్దేశమయినది.

లక్ష్యాలు:

  1. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలయందు కల వైవిధ్యం, వారి సామాజిక ఆర్ధిక స్థితిగతులు మరియు పరిపాలన నెట్‌వర్కు లోని లోటు పాతులను గుర్తించటం
  2. దశలవారీగా అన్ని జిల్లాలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భీమ పధకం అమల పరుచుట ఈ పధకం ముఖ్యోదేశ్యం.

అర్హతలు:

  1. పసుపు రంగు రేషన్ కార్డు కల ఐదుగురు సభ్యులు తో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పధకం వర్తించును.
  2. లబ్దిదారుని అర్హత గుర్తించ గల బయోమెట్రిక్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్ కార్డు పొంచుటకు, లబ్దిదారుడు సంవత్సరానికి ముప్పది రూపాయులు నమోదు/ పునరుద్ధరణ రుసుము చెల్లించవలెను.
  3. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు కు కూడా ఈ పధకం వర్తించును.

ప్రయోజనములు :

ప్రజల స్థితి గతులు మరియు భౌగోళిక పరిస్థితులు ద్రుష్టియందుంచుకొని ఆ సంబంధిత రాష్ట్రం ఇన్ – పేషెంట్  ఆరోగ్య భీమా సదుపాయం డిజైన్ చేయవలసి ఉన్నది. ఈ క్రింద  పేర్కొన్న ప్రయోజనములు తప్పనిసరిగా పధకం లో పొందుపరచవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించటం జరిగినది.

  1. అసంఘటిత విభాగాలలో పని చేయుచున్నవారు  మరి ఐదుగురు సభ్యులు కల వారి కుటుంబమునకు భీమా పధకం వర్తింపజేయడం.
  2. ఫ్యామిలీ ఫ్లోటర్ పద్ధతి లో కుటుంబమునకు సంవత్సరమునకు Rs.30000 వరకు భీమా ప్రయోజనమూ.
  3. కవర్ఏజ్ లో ఉన్న అన్ని రుగ్మతలు కు నగదు రహిత చికిత్సా,
  4. అతి తక్కువ మినహాయింపులతో సర్వ సాదారణ అనారోగ్య సమస్యలకు ఆసుపత్రి ఖర్చులు భరించుట,
  5. ముందుస్తు గా ఉన్న అనారోగ్య సమస్యలనూ కవర్ చేయుట,
  6. ఆసుపత్రి కి విజిట్ కి Rs.100 చొప్పున రవాణా ఖర్చులు భరించుట(గరిష్టంగా Rs.1000 సంవత్సరమునకు).

నిధుల సమీకరణ పద్ధతి :

  1. 75o ల ప్రీమియంలో 75% , గరిష్టంగా Rs.565 కుటుంబానికి, కేంద్ర ప్రభుత్వం భరించును.
  2. ప్రీమియంలో 25% మరియు అదనపు ప్రీమియం ఏదైనను ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం

భరించవలెను.

  1. నమోదిత లేక పునరుద్దరణ రుసుము క్రింద Rs.30 లబ్దిదారుడు చెల్లించును
  2. ఈ పధకం అమలు పరుచుటకు   పరిపాలనా సంబంధిత ఖర్చులు ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం భరించవలెను.

 

మరింత సమాచారం కొరకు : http://www.mohfw.nic.in/WriteReadData/l892s/NPHCE.pdf

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...