Home » Initiatives » States » South » Andhra Pradesh » ధరల స్తిరీకరణ నిధి/కేంద్ర కార్పస్ నిధి
onion

ధరల స్తిరీకరణ నిధి/కేంద్ర కార్పస్ నిధి

కొన్ని ఉద్యానవన పంటల ప్రత్యేకముగా ఉల్లిపాయలు, టమోటాలు మొదలగు వాని  ధరలు చాలా అస్థిరముగా ఉండును. దిగుబడి వచ్చు సమయములో ధరలు కుప్పకూలిపోతాయి. వాని నిల్వలు తగ్గగానే అత్యాధికముగా పెరిగి పోవును. ఉల్లిపాయలు మరియు టమోటాల విషయములో ఇట్టి పరిస్థితి చాలా ప్రస్పుటం. ఇట్టి ధరల హెచ్చు తగ్గులు సామాన్య వినియోగదారుల ఆహార వినియోగ బడ్గేట్  మీద అతిగా ప్రభావము చూపును.

ధరల స్థిరీకరణ నిధి  సరుకులు సేకరించుటకు వాని నిల్వలు నిర్వహించుటకు  మరియు వాని పంపిణి కి వలసిన మూల ధనం సమకూర్చును. ఇందుమూలముగా వినియోగదారులు సరుకుల హెచ్చు తగ్గుల కష్ట నష్టముల నుండి రక్షణ కల్పించబడును.

ప్రారంభ దశలో ఉల్లిపాయలు మరియు టమోటాలు మాత్రమే ఈ నిధి క్రిందకు తీసుకొని రావటము జరిగినది. ఇతరమైన అత్యవసర సరుకులు తదుపరి ఈ పదకములోనికి తీసుకు రావటము జరుగును.

లక్ష్యములు ;                                                                                                              

  1. నేరుగా రైతుల నుండి వారి సొసైటీ ల నుండి సరుకులు సేకరించుట
  2. ప్రభుత్వ గిద్దంగిలలో బఫర్ స్టాక్స్ నిర్వహించి మార్కెట్లో స్పెక్యులేషన్ ను నియంత్రించి దొంగ నిల్వలను అరికట్టుట.
  3. వినియోగదారులకు రక్షణ కల్పించుటకు సరసమైన ధరలకు సరుకులు అందించుటకు ఒక క్రమములో సరుకులు విడుదల చేయుట
  4. కార్పస్ నిధి సమీకరణ మరియు దాని నిర్వహణ భాద్యతను ధరల స్తిరీకరణ కమిటీ ని నియమించుట.

కార్పస్ నిధి :

గుర్తింపబడిన వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల సేకరణ మరియు పంపిణి కార్పస్ నిధి :

 వ్యవసాయ ఉద్యానవన ఉత్పత్తులు సేకరించుటకు  అర్హమైన ప్రతిపాదనలకు వడ్డీ లేని ధన సాయం అందించుటకు Rs.500 కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు జరిగినది. దానిని  “కార్పస్ ఫండ్ ఫర్ ప్రొక్యుర్మేంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అఫ్ ఐడెంట్ఫైఎడ్ అగ్రి-హార్టికల్చర్ కమోడిటీస్” అని పిలుచుచున్నారు.

గుర్తింపబడిన పాడైపోవు వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల సేకరణ మరియు పంపిణి కార్పస్ నిధి :

ఫండ్ మేనేజర్ ఐన స్మాల్ ఫార్మర్స్ అగ్రి-బిజినెస్ కన్దోర్తియం ఒక జాతీయ బ్యాంకు లో ఫ్లెక్సి డిపాజిట్ సౌకర్యంతో “ కార్పస్ ఫండ్ ఫర్ ప్రొక్యుర్మేంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అఫ్ పెరిష్బుల్  అగ్రి-హార్టికల్చర్ కమోడిటీస్” పేర పొడుపు ఖాతా ప్రారంభించి, ప్రభుత్వం అంద చేసిన నిధులు ఆ ఖాతాలో జమ చేసి ఉంచును.

ఈ పధకము 2015-16 నుండి 2016-17 వరకు అమలుపరుచబడును. ఈ పధకం తరువాత సంవత్సరములకు కూడా పొడిగింప అవకాసం కలదు.

 

మరింత సమాచారం కొరకు : http://agricoop.nic.in/Admin_Agricoop/Uploaded_File/opr_gud_303.pdf

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...