Home » Initiatives » States » South » Andhra Pradesh » పావలా వడ్డీ పధకం
images

పావలా వడ్డీ పధకం

ధ్యేయం : స్వయం సహాయక బృందాల రుణాల వడ్డీ భారం తగ్గించుట.

ఇది 2004 – 05 సంవత్సరములో ప్రారంభబడిన వడ్డీ సబ్సిడీ పధకం. ఇది 1వ తేది జూలై 2004 నుండి అమల్లో ఉన్నది. ఈ పధకం స్వయం సహాయక బృందాలకు ప్రోత్సాహికం గా వడ్డీ సబ్సిడీని పరిహారం రూపముగా అంద చేయబడును. ఈ పధకం అన్ని స్వయం సహాయక బృందాల బ్యాంకు రుణాలకు వర్తించును. సాలుకు 3% పైన బ్యాంక్లు వసూలు చేసిన వడ్డీని ప్రభుత్వం పరిహార రూపంలో స్వయం సహాయక బృందాలకు అండ చేయబడును. అపరాధ వడ్డీకి పరిహారం లభించదు. ఈ ప్రయోజనం బృందాల కు 5సంవత్సరములు  వరకు లభించును.

అర్హతలు : ఈ పధకం విశాఖపట్నం, విజయవాడ మరియు హైదరాబాద్ పురపాలక సంఘ పరిధులలో ఉన్న స్వయం సహాయక బృందాలకు మినహా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని ఇతర గ్రామాలలో మరియు పట్టణాలలో ఉన్న స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న సూక్ష్మ మరియు చిన్న తరహా వ్యాపారములకు అందుబాటులో ఉన్నది.  ఈ పధకం నూతనంగా ప్రారంభించి బ్యాంకు వాయిదాలు మరియు వడ్డీ క్రమం తప్పక చెల్లింపులు చేయుచున్న పైన చెప్పబడిన వ్యాపార సంస్థలకు కూడా వర్తించును.

పరిహార క్రమం :  అర్హత కల సూక్ష్మ మరియు చిన్న వ్యాపార సంస్థలు బ్యాంకులకు/ఆర్ధిక సంస్థలకు చెల్లించిన వడ్డీని ఆరు నెలలకు ఒక పర్యాయం అట్టి పరిహార మొత్తం 9% మించకుండా, బ్యాంకులకు/ఆర్ధిక సంస్థలకు పరిహారం రూపము న చెల్లించును.

ప్రక్రియ :

 

  1. డి. అర్. డి. ఎ, ప్రతి ఆరు మాసములకు ఒక సారి మండల సమాఖ్యల ద్వారా స్వయం సహాయక బృందాలు చెల్లింపు చేసిన వడ్డీ వివరాలను సేకరించును .
  2. బ్యాంకు స్టేట్మెంట్లు ఆధారంగా డి. అర్. డి. ఎ. ప్రతి ఒక్క బృందానికి చెల్లింపు చేయ వలసిన పావలా వడ్డీ క్రింద చెల్లించ వలసిన పరిహార మొత్తం లెక్క కట్టి సమాఖ్యల ద్వారా చెక్కులను స్టేట్మెంట్లు తో సహా బృందాలకు అంద చేయును.
  3. తిరిగి సమాఖ్యలు చెక్కులను సంభందిత బృందానికి గ్రామ అధికారులు కాని వారి సమక్షంలో అంద చేయబడును.

మరింత సమాచారం కొరకు : – http://industries.telangana.gov.in/Library/go%20ms%20no.42Incentives.pdf ( refer 5.11.4 )

Check Also

PC: APnewsforum

NTR Arogya Raksha Scheme:Andhra Pradesh- Register now for health Benefits upto Rs. 2 lakh

Andhra Pradesh Government has launched NTR Arogya Raksha Scheme to provide the medical treatment to ...