Home » Initiatives » States » South » Andhra Pradesh » జాతీయ కళాకారుల సంక్షేమ నిధి
images

జాతీయ కళాకారుల సంక్షేమ నిధి

భారత దేశపు సంస్క్రుతికి ఎనలేని సేవలందించి, దుర్భర దారిద్ర్యము అనుభవించుచున్న రచయిత, రచయిత్రి, కళాకారులూ మొదలగు వారికీ చేయూత అందించ ఉద్దేశ్యముతో సాంస్క్రుతిక మంత్రిత్వశాఖ ఈ నిధిని కల్పించినది. ఈ నిధి 1961 నుండి కళాకారులుగా ఉన్నవారికి వారి మీద ఆధార పడిన కుటుంబ సభ్యులకు అందుబాటు లో ఉన్నది. ఈ నిధి నుండి ఆసుపత్రి ఖర్చులు మరి ఇతర అత్యవసర ఖర్చులు భరించుటకు ఆర్దిక సహకారము లభించును.

లక్ష్యాలు : ప్రప్రధమంగా కళాకారులకు లేక వారి మీద ఆధారపడిన వారికీ  కష్ట కాలం లో ఆర్ధిక సహాయము అందించుట ఈ నిధి యొక్క లక్ష్యమై ఉన్నది. ఈ క్రింద సమయాలలో సహాయము అందును

  1. కళాకారుడు చనిపోయిన వాని కుటుంబ సభ్యులకు.
  2. కళాకారుడు అనారోగ్యం తో బాధ పడుతూ చికిత్స పొందలేని పరిస్తితిలో మరియు జీవనోపాధి సంపాదించుకోలేని పరిస్థితులలోను,
  3. కళాకారునికి అంగ వైకల్యం సంభవించిన

సహాయము పొందుటకు అర్హతలు :

  1. కళాకారుడు జీవించి ఉండగా సహాయము పొందిన అతని మరణానంతరము అతని భార్య కు అర్హత కలదు.
  2. కళాకారుడు మృతి చెందిన పిదప మొదట అతని భార్యకు ఆమె అనంతరము ఇతర కుటుంబ సభ్యులు ఎవరికైతే ఆదాయ వనరులు లేకుండా , అవివహితులై 21సంవత్సరముల వయస్సు లో ఉండునో వారికీ అర్హత కలదు

సహాయ మొత్తం : ఏ సందర్భమున సహాయము పొందినను అట్టి సహాయము ఈ క్రింది గరిష్ట పరిమిత లకు లోబడి ఉండును.

  1. కళాకారుని కి మరణం సంభవించిన రెండు లక్షల రూపాయలు,
  2. వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు,
  3. ఆకస్మిక అంగ వైకల్యం పొందిన యాభై వేలు

నిధి నిర్వహణ : ఈ నిధి సాంస్క్రుతిక మంత్రిత్వశాఖ అధీనంలో ఉండును. మంత్రిత్వశాఖ కాని ప్రాంతీయ సాంస్క్రుతిక కార్యాలయం గాని నిపుణుల సలహా మేరకు సహాయము మంజూరు చేయును.

మరింత సమాచారం కొరకు :

http://www.indiaculture.nic.in/pension-grant

Check Also

PC: livemint

Portal launched for tracking drinking water: Andhra Pradesh

Chief Minister N. Chandrababu Naidu launched the ‘Smart Water Distribution Monitoring’ web interface through which ...