Home / Initiatives / States / South / Andhra Pradesh / జన స్థిరత్వ నిధి (జన స్తిరత కోష్)

జన స్థిరత్వ నిధి (జన స్తిరత కోష్)

జన స్థిరత కోష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒక్క స్వతంత్ర ప్రతిపత్తి  గల సంస్థ గా నమోదు కాబడినది. కోష్ కి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొనటకు Rs.100కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం కార్పస్ నిధిని సమకూర్చట జరిగినది. కోష్,  నిధి మీద వచ్చిన వడ్డియే గాక జన స్థిరత్వ కోష్ పధకము ప్రోత్సహిస్తున్న సంస్థల నుండి మరియు వ్యక్తుల నుండి విరాళములు సేకరించ వచ్చును.

లక్ష్యములు :

  1. 2045వ సంవత్సరమునకు నిర్దేసింపబడిన ఆర్దిక ప్రగతి, సామాజిక అభివృద్ధి మరియు వాతావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుటకు కావలసిన జన స్థిరత్వమును సాధించుట,
  2. గర్భ నిరోధం, పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్య పరిరక్షణ లలో సాధించని లక్ష్యాలను సాధించుటకు మద్దతుగా పధకరచన, ప్రోగ్రాంలు మరియు ప్రాజెక్ట్స్ ను ప్రమోట్ చేయుట,
  3. జాతీయ జనాభా విధానము 2000 లక్ష్యాలను సాధించుటకు జాతీయ, ప్రైవేటు మరియు స్వచ్చంద రంగాలలో వినూత్న ఆలోచనా సరళి ప్రమోట్ చేయుట మరియు ప్రోత్సహించుట,
  4. జనాభా స్థిరత్వ సాధనకు ప్రభుత్వ పధకాలకు మద్దతు గా ప్రజా ఉద్యమాలను ప్రోత్సహించుట,
  5. జాతీయ అంశంమయిన జనస్థిరత్వం ప్రోత్సహించుటకు జాతీయముగా మరియు అంతర్జాతీయముగా లభించు సహాయ సహకారములను స్ట్రీమ్ లైన్ చేయుటకు ఏక గవాక్ష పద్ధతి అనుసరించుట.

జె. ఎస్.  కే. క్రింద వ్యుహాలు /పధకాలు :

కాల్ సెంటర్లు :

పునరుత్పత్తి ఆరోగ్యం మరియు కుటుంబ నియంత్రణ గురించి సాఫ్ట్ వేర్ సహాయముతో కంప్యూటర్ ద్వారా సమాచారము అందిచుటకు ఏర్పాటు జరిగినది.

ప్రేరణ పధకం :

బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్థీస్ఘర్, జార్ఖండ్, ఒడిష మరియు రాజస్తాన్ మొదలగు 7రాష్ట్రల మీద మాతృత్వ సమానమైన బాధ్యతతో  బాల్య వివాహములను మరియు పిన్న వయస్సులోనే గర్భస్తులగు  సంప్రదాయమును ఎదిరించి యుక్త వయస్సులో దంపతులై, ఆలోచనా సరళిలో మార్పు తెచ్చిన వారిని గుర్తించి వారికీ అవార్డ్లు ప్రకటించును.

19సంవత్సరముల వయస్సు వచ్చిన పిదప వివాహ మాడి, ఆ పై రెండు సంవత్సరములకు సంతానము పొందిన మహిళ కు మగ బిడ్డ కలిగినచో Rs.10000/-, ఆడ బిడ్డ ను  ప్రసవించనచో Rs. 12000/- బహుమానాము లభించును.   మొదటి బిడ్డ ను ప్రసవించిన 3సంవత్సరములకి రెండవ బిడ్డకు జన్మనిచ్చినచో మగ బిడ్డకు Rs. 5000/- లేక ఆడ బిడ్డ అయినచో Rs. 7000/- ఇవ్వబడును, కాని తల్లి తండ్రులలో ఎవ్వరైనా ఒకరు రెండవ బిడ్డ ప్రసవించిన 6మాసాలలో శాశ్వత పద్ధతి లో  కుటుంబ నియంత్రణ  అవలంభించి తీరవలెను. ఇట్టి దంపతులు దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారై ఉండవలెను.

సంతుష్టి పధకం :

ఈ పధకము గరిష్ట జనాభా సాంద్రత కల రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్థీస్ఘర్, జార్ఖండ్, ఒడిష మరియు రాజస్తాన్ లోనే అమలలోనికి వచ్చినది. ప్రైవేటు రంగం లోని గ్యనేకాలిజిస్ట్ మరియు వేసక్టమి సర్జెన్లను ఆహ్వానించి ప్రైవేటు పబ్లిక్ బాగస్వామ్య పద్దతిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుపబడును.

ఈ పధక నిభందనలు అనుసరించి  కోష్ గుర్తింపు పొందిన ప్రైవేటు హాస్పిటల్ / నర్సింగ్ హోం (స్తేరిలైజేషణ్ సేవలకు నాణ్యత హామీ పొంది ఉండవలెను) లతో అవగాహన ఒప్పందం  చేసుకొనును. అట్టి ఆసుపత్రి కాని నర్సింగ్ హోం కాని పది ట్యూబెక్టమి లేక వేసక్టమి ఆపరేషన్ లు చేసిన ప్రోత్సాహకం లభించును.

వర్చ్యువల్ రిసోర్స్ సెంటర్ (వి. అర్. సి..) :

రక్త హీనత, లింగ భేదము, మాతృ శిశు మరణాలు, బలహీనమౌతున్న స్త్రీ పురుష నిష్పత్తి, కౌమార ఆరోగ్యం, మొదలగు వాని మీద  మీడియాకు, పరిశోధకులకు, విద్యార్థులకు, ఎన్జివోలకు, సామాన్య ప్రజానీకానికి జన స్థిరత కోష్ పధకం గురించి వివరిస్తూ ఫిల్మ్లు, పోస్టర్స్ అండ్ ఛాయా చిత్రలు అందుబాటులో ఉంచును.   

 

మరింత విస్తారమైన వివరములకు : http://jsk.gov.in/vrc.pdf

Check Also

Solar Power based Water Pumping Programme

1. The Govt of India has selected the Andhra Pradesh State as one among the ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *