Home / Initiatives / States / South / Andhra Pradesh / బాలికలకు మాధ్యమిక విద్యా ప్రోత్సాహానికి జాతీయ పధకం

బాలికలకు మాధ్యమిక విద్యా ప్రోత్సాహానికి జాతీయ పధకం

పధకం : నేషనల్ స్కీం అఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్.

లక్ష్యం  : 14 నుండి 18 సంవత్సరముల మధ్య వయస్సు కల బాలికలను మాధ్యమిక విద్యలో ప్రవేశము తీసుకొని విద్య ను కొనసాగించ ప్రోత్సహించటం ఈ పధకం ఒక్క ప్రధమ ఉద్దేశ్యం. ప్రత్యేకించి 8వ తరగతి లో ఉత్తీర్ణులు అయన బాలికలు మాధ్యమిక విద్య కొనసాగించటం. ఇది జాతీయ పధకం.

అర్హతలు : 1.  8వ తరగతి ఉత్తీర్ణత పొందిన షెడ్యూల్ జాతుల మరియు షెడ్యూల్ తెగల బాలికలు మాత్రమే అర్హులు .

  1. కస్తూర్బ గాంధీ బాలికా విద్యాలయం నుండి 8వ తరగతిలో ఉత్తీర్ణత పొంది 9వ తరగతిలో రాష్ట్ర / జాతీయ లేక ప్రభుత్వ ఎయిడెడ్ లేక లోకల్ బాడీ పాఠశాల లో ప్రవేశం నమోదు చేసుకున్న బాలికలు ( షెడ్యూల్ జాతికి షెడ్యూల్ తెగలకు సంబంధం లేకుండా)
  2. 16 సంవత్సరములు లోపల 9వ తరగతి ప్రవేశం పొంది ఉండవలెను ( ఆ విద్యా సంవత్సర లో 31st మార్చి)
  3. వివాహితురాలు, అన్-ఎయిడెడ్ పాఠశాల కేంద్రీయ పాఠశాలలు యందు ప్రవేశం పొందిన బాలికలు అనర్హులు.

ప్రోత్సాహకాలు : Rs.3000/- జాతీయ బ్యాంకు యందు కాని లేక తపాలా కార్యాలయం లో కాని అర్హులైన బాలిక పేరు న డిపాజిట్  చేయబడును. అట్టి డిపాజిట్ ఆ బాలిక 10వ తరగతి యందు ఉత్తీర్ణత పొంది 18 సంవత్సరముల వయస్సు దాటిన పిదప వడ్డీ తో సహా డిపాజిట్ చెల్లింపు జరుగును. కాల వ్యవధి తీరకుండా ముందస్తు రద్దు సదుపాయం లేదు.

అప్లై చేయుటకు సమాచారం కొరకు :  http://mhrd.gov.in/incentives

Check Also

Solar Pump Set Scheme For Agriculture

In order to promote the use of non conventional energy in the agriculture sector, the ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *